కరీంనగర్ జిల్లా: వీణవంక మండలంలో చల్లూరు, వీణవంక గ్రామంలో శనివారం సాయంత్రం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా, హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలతో పోలీస్ కవాతు నిర్వహించారు. వీణవంక బస్టాండ్ కూడలి వద్ద మండల ప్రజలను ఉద్దేశించి హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి మాట్లాడుతూ.. మండల ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినిగించుకోవాలని, యువత వాట్సాప్ లలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని, రాజకీయ నాయకులను రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు చేయరాదని, ఇతరులను కించపరిచి పోస్టులను గ్రూపులలో పెట్టినట్లయితే, పోస్ట్ చేసిన వ్యక్తితో పాటుగా, అడ్మిన్ కూడా కేసుల పాలవుతారని, వాట్సాప్ గ్రూప్ లలో ఉండే వ్యక్తులు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.అనంతరం ఎస్సై తోట తిరుపతి మాట్లాడుతూ…యువత రాజకీయ నాయకుల కొరకు మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని, వాట్సాప్ గ్రూపులలో ఇతరులను రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని, ఎలక్షన్లు ఐదేళ్ల ఒక్కసారి వస్తాయని, ఒక్కసారి కేసు అయిందంటే జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుందని, యువకులు ఉన్నత చదువులతో తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేయాలని, రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించాలని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తప్పవని,మండల ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు వచ్చిన పోలీసులను నేరుగా సంప్రదించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని, పోలీసులు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి, రక్షణ కల్పిస్తామన్నారు. ఈ కవాతు కార్యక్రమంలో జమ్మికుంట టౌన్ సిఐ రవి, సిఆర్పిఎఫ్ కమాండర్ వీణవంక మాజీ సర్పంచులు నీల కుమారస్వామి, చిన్నాల ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు సాహెబ్ హుస్సేన్, బిజెపి నాయకులు బత్తిని నరేష్ గౌడ్, మోటం శ్రీనివాస్ గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.