- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పెద్దలింగపూర్, గ్రామంలో నీళ్లు లేక ఎండిన వరి పంటలకు నిప్పు పెట్టి కన్నీళ్లు పెడ్తున్న రైతన్నలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలంలో అంతగిరి, పెద్దలింగపూర్ గ్రామాలలో 800 ఎకరాలలో ఎండిన పంట పొలాలకు నిప్పు ఆంటీస్తు దుఃఖిస్తున్న రైతన్నలను ఓదార్చుతూ బెంద్రం.తిరుపతి రెడ్డి మాట్లాడాతూ.. ఇల్లంతకుంట మండలంలో రెండు డ్యాములు వున్నా మా గ్రామాలలో పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో బీటలు వారి పంటలు ఎండిపోయిన రైతులు ఎండిన పంట గడ్డి కూడా కోయడానికి ఖర్చులు అవుతు అప్పుల పాలవుతున్నామని అగ్గిపెట్ట కన్నీళ్లు పెడ్తున్నా రైతులను రెండు రోజులలో పరామర్శించి గౌరవ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి.సత్యనారాయణ సహృదయంతో అలోచించి ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలని, లేనిపక్షంలో కనీసం ఎండిపోయిన రైతుల పంటలకు ఎకరాకు 40000 వేల రూపాయలు నష్టపరిహార సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామాన్నరు,రైతులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ వరి పంట దహనాల నిరసనలలోఅమ్ముల అశోక్, అమ్ముల మహేష్, బండారి రవి, కదరా రాజు,కల్లూరి సురేష్, సలంద్రి పర్శరం, గంట మల్లేశ్, అరకుటి మల్లేష్,అరుకాల మల్లేశ్, అరుకాల కొమురయ్య, కోరెం నర్సయ్య, కోరేం భూమయ్య, ఇల్లంతకుంట వెంకటేశ్వర్లు, తూముల మహేష్, అరుకాల రాజలింగం, కోరం బుచ్చవ్వ తదితర రైతులు పాల్గొన్నారు.