- మేం చెప్పిందే చేయాలి.. లేదంటే దౌర్జన్యం చేస్తాం.
- మేం అక్రమాలు చేస్తున్నా చూస్తూ ఉండాలి.. కాదంటే దాడులకు దిగుతాం.
- మేం తిట్టినా పడుండాలి.. ఫిర్యాదు చేస్తామని పోలీసుస్టేషన్‌కు వెళ్తే ఎదురుకేసు పెట్టిస్తాం..”
ఇదీ రాష్ట్రంలో కొంతమంది వైకాపా నాయకులు ప్రభుత్వోద్యోగులపై దౌర్జన్యాలకు తెగబడుతున్న తీరు. మేం చెప్పిన పని చేయకుండా మాకే నిబంధనలు చెబుతారా? అంటూ కొందరు అధికార పార్టీల నేతలు రెచ్చిపోతున్నారు. అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు. పలుచోట్ల పోలీసులూ దన్నుగా నిలబడుతుండటం నేతలకు మరింత బలం చేకూరుస్తోంది. అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో తమకు కావాల్సిన స్టేషన్లు, సర్కిళ్లలో పోస్టింగు పొందిన ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలు ఇలాంటి వాటిపై ఫిర్యాదులొచ్చినా తొక్కిపట్టేస్తున్నారు. తప్పనిసరై కేసు కట్టినా.. మొక్కుబడి సెక్షన్లతో మమ అనిపిస్తున్నారు. ‘అవతలి వ్యక్తులు కూడా మీపై ఫిర్యాదు చేస్తామంటున్నారు.. మీపైనా కేసు కట్టాల్సి వస్తుంది’ అంటూ బాధితుల్ని భయపెట్టి ఫిర్యాదులు వెనక్కి తీసుకునేలా చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది తమపై తరచూ జరుగుతున్న దాడుల గురించి ఫిర్యాదులు చేస్తున్నా బాధ్యులపై కేసులు పెట్టటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలెన్నో తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి.
అన్నమయ్య జిల్లా రాయచోటి లో సచివాలయ సిబ్బంది ఆగడాలు సమస్య పరిష్కారం కొరకు వచ్చిన వ్యక్తి పై సచివాలయ ఉద్యోగి దాడికి దిగిన ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ వుంటుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.