సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల వెనకాల గల సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకులు.. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. అనాధాశ్రమం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన భామండ్ల రాజు, జంగపల్లి గ్రామానికి చెందిన మహంకాళి ప్రశాంత్, కొంకటి వేణు అనే యువకులు సెల్ టవర్ ఎక్కి గురువారం ఆందోళన చేశారు. మంత్రి సీతక్క వచ్చేంతవరకు దిగేది లేదన్నారు. సమాచారం అందుకున్న బెజ్జంకి పోలీసులు. ఎంపీడీవో లక్ష్మప్ప సంఘటన స్థలానికి చేరుకొని ఎంపీడీవో హామీ తో యువకులు సెల్ టవర్ పై నుంచి కిందికి దిగారు.