- ప్రజలకు అందించాల్సిన సన్నబియ్యాన్ని ఇవ్వకుండా దోచుకుంటున్న ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చే నిర్వాహకులు
ఆంధ్రప్రదేశ్ : బాపట్ల నియోజకవర్గం లో జరుగుతున్న ఒక పని రేషన్ డీలర్లకు ఇంటింటికి బియ్యం ఇచ్చే నిర్వాహకులకు కాసులు కురిపిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే బియ్యం మీరు తినరు కదా అని వారితో వేలిముద్రలు తీసుకుని కేజీ ₹10 లెక్కన ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు. కాని బియ్యం ఇవ్వటం లేదు. బియ్యం అడిగినా కూడా మీరు తినరు కదా అని వారికి బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నారు. 10 రూపాయల కొన్న ఆ కేజీ బియ్యం 15 రూపాయలకు రేషన్ డీలర్లకు అమ్ముతున్నారు. డీలర్లు 20 రూపాయలకు రేషన్ బియ్యం రీసైకిలింగ్ చేసే వారికి దొంగ చాటుగా అమ్ముతున్నారు.అదే బియ్యాన్ని ప్రజలకు 25 కేజీల బస్తా 1600 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే కేజీ 64 రూపాయలకు తిరిగి ప్రజలే మరల అదే బియ్యాన్ని కొంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తుంటే ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చే నిర్వాహకులు రేషన్ డీలర్ల పని వల్ల ఈ పథకం పక్కత్రోవ పడుతుంది. గ్రామాల్లో రేషన్ కార్డు దారుల దగ్గరికి వెళ్లి అసలు మీకు బియ్యం ఇస్తున్నారా డబ్బులు ఇస్తున్నారా అని అడిగితే కచ్చితంగా దీనిపై వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా కర్లపాలెం మండలంలో ఇలాంటి తంతు బాగా జరుగుతుంది. మండలంలోని దాదాపుగా అన్ని రేషన్ బియ్యం బండి నిర్వాహకులు ఇదే పని చేస్తున్నారు.