దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ECI) ప్రకటించింది. దీంతో పాటు సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఈసీ అనౌన్స్ చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్‌ని విడుదల చేసింది.
లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 7 విడతల్లో జరిగే లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి.
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే… ఒకే రోజున మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీకి పోలింగ్ జరగనుండగా… తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో… దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
మార్చి 20న లోక్ సభ ఎలక్షన్ నోటిఫికేషన్
- జూన్ 4న కౌంటింగ్
- ఫేజ్ 1- ఏప్రిల్ 19
- ఫేజ్ 2- ఏప్రిల్ 26
- ఫేజ్ 3 – మే 7
- ఫేజ్ 4-మే 13
- ఫేజ్ 5- మే 20
- ఫేజ్ 6- మే 25
- ఫేజ్ 7- జూన్ 1
- ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్ ప్లీనరీ హాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్.. కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులతో కలిసి 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.
- ఎన్నికల విధుల్లో 1.5 కోట్లమంది పాల్గొంటారు- సీఈసీ
चुनावी प्रक्रिया में बाहुबल के अलोकतांत्रिक प्रभाव को रोकने के लिए कई उपाय किये हैं. Strict directions given to DMs & SPs to ensure level playing field. CAPF to be deployed adequately & assisted by Integrated control rooms in each district. Check posts & drones to ensure vigil. pic.twitter.com/Ns24MQptrV
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024