ఈరోజు కారంపూడిలో లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటించారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి ఉన్న నేపథ్యంలో ఆయా కొద్దిమంది ముఖ్య నాయకుల ఇంటి వద్దకు తానే స్వయంగా వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ముందుగా కారంపూడి మండలంలోని, పేటసనిగండ్ల గ్రామం వద్ద.. ఆంజనేయ స్వామి గుడి పూజలు నిర్వహించారు. తర్వాత పేటశనిగండ్ల ఎస్సీ కాలనీ నాయకులతో మాట్లాడారు.
గ్రామంలో ప్రధానంగా, కాల్వలు బాగు చేయించడం, సైడ్ డ్రైన్స్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం గురించి అడగగా వాటికి హామీ ఇచ్చారు.
పట్టణంలోనే పలువురు ముఖ్య నాయకులను కలిసి.. అధికారంలోకి వచ్చాక నెరవేర్చుకునే పలు అంశాలపై చర్చించారు. నీటి సమస్యను పరిష్కారం చేసుకునేందుకు గాను.. వరికెపూడిసెల ప్రాజెక్టు, గోదావరి జలాలని తెచ్చుకునేలా లిఫ్ట్ ల ఏర్పాటు, వాటర్ గ్రిడ్ ఏర్పాటు , అలాగే యువతకు ఉపాధి కోసం పల్నాడులో లాజిస్టిక్ పార్క్, అస్పత్రి ఏర్పాటు అంశాలను, టిడిపి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. అలాగే ఎన్నికలు సక్రమంగా నిర్వహించుకునే వ్యూహలపై చర్చించారు.
కారంపూడికి చెందిన బొమ్మిన శేషగిరి రావు గారి కుమారుడి వివాహం సందర్బంగా వారి గృహంలో వరుడుని ఆశీర్వదించారు.
ఆర్యవైశ్య ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. అధికారంలోకి రాగానే వారు ఎదురుకుంటున్న సమస్యలని పరిష్కరిస్తాం అని భరోసా నింపారు.
అనంతరం పట్టణ పరిధిలోని బ్రహ్మ నాయుడు కాలనీలో ఎస్సీ నాయకులను కలిశారు. ప్రధానంగా అక్కడ నీటి సమస్య ఉందని తెలపగా.. అందుకు గాను నీటి ట్యాంక్ ను ఏర్పాటు చేస్తానని, పైప్ లైన్ నిర్మిస్తాం అని తెలిపారు. అలాగే అక్కడ ప్రజలు కోరిన విధంగా.. కమ్యూనిటీ హల్ నిర్మిస్తాం అని హామీ ఇచ్చారు.