మంచిర్యాల జిల్లా,చెన్నూరు పట్టణానికి చెందిన మామిడి అక్షితకి శ్రీశ్రీ కళావేదికలో ఉన్నతమైన పదవి దక్కింది. శ్రీ శ్రీ కళావేదిక స్థాపకుడు, చైర్మన్ కత్తిమండ ప్రతాప్, మామిడి అక్షితని తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షురాలుగా నియమించారు. ఈ విధంగా అక్షిత మాట్లాడుతూ 2022 లో తన స్వీయ రచన సిరామృతం ముద్రణతో పరిచయమైన కళాకారుల వేదిక ఇప్పుడు రాష్ట్ర స్థాయికి వరకు తీసుకువెళ్లడం సంతోషకరమని అన్నారు. ఈ బాధ్యతని చిత్తశుద్ధితో తోటి కళాకారులను ప్రోత్సహించే విధంగా వినియోగించుకుంటానని వాక్యానించారు. కాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లంకదాసరి అశ్విని, రాష్ట్రకార్యదర్శులుగా సుగుణ, రేణుక నియమితులయ్యారు.