రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడం ఖాయమని, మరోమారు వైయస్ జగన్ సీఎం అవుతారని, తాము అఖండ మెజార్టీతో ఎన్నికల్లో గెలుస్తామని వైసిపి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేడాడ తిలక్, ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిని పిరియా విజయ సాయిరాజ్ అన్నారు. నియోజకవర్గ వైసిపి ఆధ్వర్యంలో ఇచ్చాపురం పట్టణంలో మీడియా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి తిలక్ మాట్లాడుతూ సొంత పార్టీలో ఉన్నవారికి అన్యాయం చేయడంలో అప్పుడు ఎర్రం నాయుడు, ఇప్పుడు అచ్చం నాయుడు ముందున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు వైసిపిని మరలా అధికారంలోకి తెస్తాయని అన్నారు. ఎంపీగా రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. ఎమ్మెల్యే అభ్యర్థిని పిరియా విజయ మాట్లాడుతూ ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రజలకు 2,696 కోట్ల రూపాయల అభివృద్ధిని అందించడం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తమ విజయం సాధిస్తామని నమ్మకం ఉందని, పార్టీ శ్రేణులు తమను పూర్తిగా ఆశీర్వదించాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ… ఎమ్మెల్యేగా డాక్టర్ అశోక్, ఎంపీగా రామ్మోహన్ నాయుడు రెండు పర్యాయాలు పొడిచిందేమీ లేదని విమర్శించారు. ఇచ్చాపురంలో వివిధ రైళ్ల హాల్టును, వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలుపుదలకు తాము కృషి చేస్తే తమ విజయం గా వారు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఇతర నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ పార్టీ శ్రేణులందరూ ఐకమత్యంగా పార్టీ విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.