కాంగ్రెస్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లిలో సామ్రాజ్యవాద విస్తరణకు కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం ఆయన గోదావరిఖనిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మరిచిపోయిందని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీలపై ప్రశ్నిస్తోన్న ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యాపారాలు, పదవులు, ఆస్తులు కాపాడుకోవడానికి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి వివేక్‌కు సామంత రాజ్యమేమీ కాదన్నారు. వేలకోట్ల ఆస్తులున్న వివేక్ కి దమ్ముంటే జనరల్ సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు. పెద్దపల్లి ప్రాంత దళిత సామాజిక వర్గాలను వివేక్ కుటుంబం అణగదొక్కుతోందన్నారు.