ఆంధ్రప్రదేశ్ వైసిపి పాలనలో కబ్జాదారులు రెచ్చిపోయారు. అది బొందల గడ్డయిన , నీటి కుంటయినా దోచుకోవడమే వారి పని. మనమందరము చివరికి వెళ్ళేది బొందలగడ్డకే అయినా బ్రతికుండగానే మాకు బొందలగడ్డ కావాలని కబ్జా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా కారంపూడిలో దళిత వాడ కు సంబంధించిన రెండు ఎకరాల స్మశాన వాటికకు సంబంధించిన భూమి కబ్జాకు గురైంది. హద్దురాళ్ళు ఉన్నప్పటికీ దళితులకు సంబంధించిన స్మశానవాటికను అడ్డగోలుగా ఆక్రమించుకుంటున్నారని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాదారుల పై అలాగే సహకరించిన అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాల్వ ప్రభుదాస్, పాలే పోగు బాబు కోరుతున్నారు కోరుతున్నారు.