Indian Army : జై జవాన్, జై కిసాన్ అంటూ అన్నం పెట్టే రైతుని, దేశానికి రక్షణగా నిలిచిన జవాన్ ను గౌరవిస్తున్నారు. కుటుంబాన్ని విడిచి.. దేశ రక్షణ కోసం చలి, వాన, ఎండ.. ఇవేమీ లెక్కచేయకుండా ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా దేశం కోసం పనిచేసే త్యాగశీలులు జవాన్లు. కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేసే సైనికులంటే ఎవరికైనా అంతులేని గౌరవమే. అలాంటి ఓ సైనికుడికి .. మాజీ సైనికులు, గ్రామస్తులు ఊహించని విధంగా స్వాగతం పలికారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామానికి చెందిన (JCO- Junior Commissioned Officer ) జేసీవో అడ్డగుంట మల్లయ్య 25 ఏళ్లపాటు దేశ రక్షణ కోసం పనిచేసి, ఉద్యోగ విరమణ తర్వాత గ్రామంలో అడుగుపెట్టిన ఆయనికి గ్రాండ్ వెల్కమ్ పలికారు. భాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ దేశ సేవ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జైయహో జనతా జవాన్ ఫౌండేషన్ సభ్యులు, మాజీ సానికుల సంఘం అధ్యక్షులు బి. మోహన్, అలాగే రాజి రెడ్డి, శంకర్ రావ్, శ్రీనివాస్, పైడి మహేష్, జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వెదురుగట్ట మాజీ సర్పంచ్ పతంగి ప్రభాకర్, ప్రజలు పాల్గొన్నారు.