పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ఆర్. రాఘవేంద్ర బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశంతో పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి నియామక ఆదేశాలు వచ్చేంత వరకు పల్నాడు జిల్లా ఎస్పీగా రాఘవేంద్ర విధులు నిర్వహించనున్నారు.
గుంటూరు,ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.