contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Civils 2023 – Top 10 Ranks : తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్లు వీరే!

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ – 2023 ఫలితాలు విడుదలయ్యాయి. 2023 ఏడాదికి గాను మొత్తం 1,016 మందిని ఎంపిక చేశారు. ఐఏఎస్ కు 180, ఐఎఫ్ఎస్ కు 37, ఐపీఎస్ కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరిలో 613 మంది, గ్రూప్ బీ సర్వీసెస్ లో 113 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ తెలిపింది.

యూపీఎస్సీ ఆలిండియా టాప్ ర్యాంకర్లు వీరే:
ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ ర్యాంక్ సాధించగా అనిమేశ్ ప్రధాన్, తెలుగు అమ్మాయి అనన్య రెడ్డి రెండు, మూడు ర్యాంకులు సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, రుహాని, సృష్టి దబాస్, అన్ మోల్ రాథోడ్, ఆశిష్ కుమార్, నౌషీన్, ఐశ్వర్యం ప్రజాపతి. మూడో ర్యాంకు సాధించిన అనన్య తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు.

సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజాలు:
50 మందికి పైగా తెలుగు విద్యార్థులు సివిల్స్ ను క్రాక్ చేసినట్టు తెలుస్తోంది. వీరిలో కొందరు విజేతలు వీరే. దోనూరు అనన్య రెడ్డి (3), నందల సాయి కిరణ్ (27), మేరుగు కౌశిక్ (82), పంకీసు ధీరజ్ రెడ్డి (173), అక్షయ్ దీపక్ (196), గణేశ్న భానుశ్రీ లక్షీ అన్నపూర్ణ (198), నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి (382), బన్న వెంకటేశ్ (467), కడుమూరి హరిప్రసాద్ రాజు (475), పూల ధనుష్ (480), కే శ్రీనివాసులు (526), నెల్లూరు సాయితేజ (558), కిరణ్ సాయింపు (568), మర్రిపాటి నాగభరత్ (580), పోతుపురెడ్డి భార్గవ్ (590), కే అర్పిత (639), ఐశ్యర్య నెల్లిశ్యామల (649), సాక్షి కుమారి (679), చౌహాన్ రాజ్ కుమార్ (703), గాదె శ్వేత (711), వి ధనుంజయ్ కుమార్ (810), లక్ష్మీ బానోతు (828), ఆదా సందీప్ కుమార్ (830), జే రాహుల్ (873), వేములపాటి హనిత (887), కే శశికాంత్ (891), కెసారపు మీన (899), రావూరి సాయి అలేఖ్య (938), గోవద నవ్యశ్రీ (995) తదితరులు సివిల్స్ కు ఎంపికయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :