contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రసమయీ..మోసపూరిత హామీలిచ్చిడు :బిజెపి మానకొండూర్ ఇంచార్జి గడ్డం నాగరాజు

 

నీకు ఇల్లిస్తా…భూమిస్తా… ఉద్యోగమిస్తా అని మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని బిజెపి మానకొండూర్ ఇంచార్జి గడ్డం నాగరాజు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు హితవు పలికారు మండలంలోని పోలంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూం భాదితులను సోమవారం తిమ్మాపూర్ బిజెపి శాఖ ఆధ్వర్యంలో నాగరాజు పరామర్శించారు.గత ఆరేళ్ళ క్రింద గ్రామంలో రోడ్డు విస్తరణ జరిగినప్పుడు 9 మంది ఇండ్లు కూలిపోయాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూం లు ఇస్తామని హామీలు ఇవ్వగా భాదితులు ఒప్పుకుంటేనే రోడ్డు విస్తరణ జరిగిందని నాగరాజు అన్నారు.రోడ్డయితే పూర్తైంయింది కానీ ఇంతవరకు భాదితులకు న్యాయం జరగలేదని ఇది పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. అడిగినప్పుడల్లా రేపు.. మాపంటూ కాలయాపన చేస్తూ, ఆయన దగ్గరికిపో..ఈయనదగ్గరికిపో.. అంటూ భాదితులను తిప్పించుకోవడం చాలా దారుమని అన్నారు.ఇలా తిరిగి తిరిగి రోడ్డు ప్రమాదం పాలైన వారి ప్రాణాలు పొతే భాద్యులెవరని ప్రశ్నించారు.భాదితుల ఇంటింటికి తిరిగిన నాగరాజు వారియొక్క భాదలను విన్నారు.గాయాలపాలైన వారికి హాస్పిటల్ ఖర్చులు చెల్లిస్తామన్న ఎమ్మెల్యే అనుచరులు భాదితులను మోసం చేశారని పేర్కొన్నారు.హాస్పిటల్ ఖర్చులు చెల్లించకున్నా పర్వాలేదు కానీ  భాదితులను పరామర్శించే సమయం కూడా ఎమ్మెల్యే కు దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు.హాస్పిటల్ ఖర్చులతో పాటుగా రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు నష్టపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల 40 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే రెట్టింపు చెల్లించి మాట నిలుపోకోవాలని కోరారు.ఇలాగే రోడ్డు విస్తరణలో భాగంగా పర్లపల్లి, మొగిలిపాలెం గ్రామాల్లో కూడా ఇండ్లు నష్టపోయిన వారికి న్యాయం జరగలేదని తెలిపారు.ఇప్పటికైనా 15 రోజుల్లోగా రోడ్డు విస్తరణ భాదితుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఎంతటి పోరాటానికైనా సిద్దమేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,ప్రధాన కార్యదర్సులు గొట్టిముక్కుల తిరుపతి రెడ్డి,కిన్నెర అనీల్,ఉపాధ్యక్షులు ఒడ్నాల రవీందర్,కార్యదర్శి పడాల రాజు గౌడ్,సోషల్ మీడియా కన్వీనర్ ఐల రాజశేఖర్,సీనియర్ నాయకులు ఒడ్డేపల్లి కనకయ్య,నూనె సంపత్,ఎర్రోజు లక్ష్మణ్,రేగూరి సుగుణాకర్,ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్,అల్లెపు కుమారస్వామి,చేపూరి దిలీప్,పడాల తిరుపతి,పడకంటి రమణ తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :