కరీంనగర్ జిల్లా: గన్నేరువరం నుండి కరీంనగర్ కు మానేరు నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు బ్రిడ్జి జేఏసీ అధ్యక్షుడు సంపతి ఉదయ్ కుమార్, కార్యదర్శి పుల్లెల రాములు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జి లేని కారణంగా సమయానికి 80 గ్రామాల ప్రజలకు విద్య వైద్యం అందని పరిస్థితి ఏర్పడినన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాలకు చెందిన 80 గ్రామాల ప్రజలకు కరీంనగర్ దగ్గర అవుతుందన్నారు. మూడు మండలాల ప్రజల సౌకర్యార్థం కొరకు బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ఎలక్షన్ కోడు ముగియగానే బ్రిడ్జి జేఏసీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి నిర్మాణం కొరకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.