కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ శాసనసభ్యులు సభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హుజురాబాద్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలు వోడితల ప్రణవ్, పురుమల్ల శ్రీనివాస్ గార్లతో కలిసి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్బంగా కరీంనగర్ నగరంలోని జ్యోతిబా పూలే మైదానం నుండి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రాష్ట్ర,జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.