కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని మూడు రోజులపాటు జరిగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం, శకటోత్సవం, రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం స్వామివారికి నూతన వస్త్ర అలంకరణ అభరణాలు పంచామృతాలు,అభిషేకం చేశారు. నరసింహుని స్థానా చార్యులు అర్చకులు పరంకుశం యాదగిరి చార్యులు. వెంకటనారాయణ ప్రదీప్ చార్యులు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి పల్లెకి సేవలో తీసుకెళ్లి మూల నరసింహస్వామి దేవాలయ క్షేత్రంలో వేద పండితులు మణి శంకర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణం జరిపించారు. అర్చకులు మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం శకటోత్సవం, బుధవారం ఉదయం రథోత్సవం జరుగుతుందని తెలిపారు. మూల నరసింహస్వామి ఆలయం వద్ద శకటోత్సవం జరిగే ప్రదేశాన్ని ఎస్సై తాండ్ర నరేష్ పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. కళ్యాణోత్సవంలో గ్రామ పంచాయతీ కరోబర్ మాధవ్ రావు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ బోయిని అంజయ్య, ప్రజాప్రతినిధులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.