- మదనపల్లిలో ఆక్రమణల పర్వం
- రోడ్డులో ఉండాల్సిన పిల్లలు
- అక్కున చేర్చుకుంటే రోడ్డుపాలు చేశారు
ఉమ్మడి చిత్తూరు జిల్లా , మదనపల్లి : రోడ్డున పడాల్సిన అనాధ పిల్లలను అక్కున చేర్చుకొని వారి బాగోగులు చూస్తున్న చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ మీద అధికారం మదంతో అధికారుల అండతో ట్రస్ట్ ఉన్న భవనం మీద కన్నేసి అనాధ పిల్లలను రోడ్డుపాలు చేసిన ఘటన మదనపల్లి తాలూకాలోని శానిటోరియం ( ఆరోగ్యవరం ) లో చోటు చేసుకుంది. సారాగుల రేణుక అనే మహిళ అనాధ పిల్లల సంరక్షణ కోసం ఆదాము చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో నిర్వహిస్తుండగా, సంవత్సరం క్రితం అప్పటి డైరెక్టర్ డాక్టర్ వెస్లీ , చారిటబుల్ ట్రస్ట్ నడుపుకొనుటకు ఒక భవనాన్ని కేటాయించి మూడు సంవత్సరాలు అందులో ఉండే విధంగా ట్రస్ట్ కు అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా డైరెక్టర్ పదవి చేపట్టిన రవీంద్ర మాత్రం ట్రస్ట్ ఉన్న భవనాన్ని తక్షణమే కాళీ చేయాలని హుకుం జారీ చేశారు. ఉన్నట్టుండి తాము ఎక్కడికి వెళ్లాలని తమకి ఇంకా రెండు సంవత్సరాలు ఉండటానికి అగ్రిమెంట్ ఉందని ట్రస్ట్ సభ్యులు కోరారు. అయినా విననప్పటికీ ట్రస్టు సభ్యులు కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టులో ఉన్నప్పటికీ స్థానిక CSI చర్చిలో సెక్రటరీగా ఉన్న అన్నిస్ మోసస్ అనే వ్యక్తి ప్రత్యేక శ్రద్ధతో ట్రస్ట్ ఉన్న భవనాన్ని ఖాళీ చేయించాలని చూశారు. అయితే ట్రస్ట్ సభ్యులు మదనపల్లి తాలూకా పోలీసులను ఆశ్రయించగా పోలీస్ అధికారి అయిన సిఐ స్పందిస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి గొడవలు వద్దని ఎన్నికలు అయ్యేవరకు ట్రస్ట్ ఉన్న భవనం తాళాలు వేసి తమ వద్దే ఉంటాయని నచ్చజెప్పి పంపించారని, అయినప్పటికీ అన్నిస్ మోసస్ అనే వ్యక్తి రాజకీయ ప్రమేయం ఉన్న కొంతమంది యువకులను రప్పించి బలవంతంగా భవనంలోని సామాన్లను బయటకు పడేశారని ట్రస్ట్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనాధ పిల్లలు రోడ్డున పడడంతో మరొకసారి తాలూక పోలీస్ స్టేషన్ కి న్యాయం కోసం వెలగా సీఐ పొంతనలేని సమాధానం చెప్పి కావాలంటే డి.ఎస్.పి దగ్గరికి వెళ్లి చెప్పుకోండి అంటూ తమని అవమానించారని, అనాధ పిల్లల కోసం తమకు న్యాయం కావాలని మంగళవారం పిల్లలతో సహా డిఎస్పి ఆఫీసుకు చేరుకుని తమ బాధ చెప్పుకున్నారు. అధికారులు వైసిపి నాయకులకు తొత్తుగా వ్యవరిస్తారా ? మానవత్వం చాటుతారా ! వేచి చూడాలి.