ఎన్నికల్లో ఓటు వేసేముందు ఒకటికి రెండు సార్లు అలోచించి ఓటు వేయాలి. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధికి పాటుపడే వారికే ఓటు వేయాలి. అటువంటప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. లేకుంటే భవిష్యత్ అంధకారమవుతుందని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ పేర్కొన్నారు.
నీతి నిజాయితీతో… ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఉన్న నాయకులను ఎన్నుకోవాలి. మహిళలకు రక్షణ, యువతకు ఉద్యోగాలు, పేదలకు చేయూత ఇవ్వగలిగే నాయకులకు ఓటు వేయాలి. సరైన నాయకులను ఎన్నుకోకపోతే అభివృద్ధి మరింత కుంటుపడుతుంది. నేరం చేయడం ఎంత తప్పో… నేరాన్ని ప్రోత్సహించటం కూడా అంతే తప్పు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ధర్మాన్ని గెలిపించుకోవాలి. డబ్బుకు, మందుకు లొంగితే జీవితాంతం బానిసలుగా బతకాల్సి వస్తుంది.
ఓటు వజ్రాయుధం లాంటిది. ఒక రోజు తీసుకునే నిర్ణయం ప్రతి ఒక్కరి భవిష్యత్ ని నిర్ణయిస్తుంది. అభివృద్ధికి పట్టం కట్టేవారికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోను ప్రలోభాలకు లొంగకుండ సమర్ధవంతమైన నాయకుడిని గెలిపించాలి. భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకొవాలి.
తెలంగాణ సియం రేవంత్ రెడ్డి స్పందన