పల్నాడు జిల్లా, కారంపూడి పట్టణంలో కారుకి నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు. పట్టణంలో బ్రహ్మనాయుడు ప్రభుత్వ పాఠశాల ఎదురుగ పార్క్ చేసి ఉన్న వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన రాజకీయ కోణంలో వెళుతుందా లేక ఏంటి ? ఎన్నికల సందర్భగా పల్నాడులో అనేక దారుణాలు జరిగాయి, జరుగుతున్నాయి .. జిల్లా పోలీసు యంత్రాంగం ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేవరకు పల్నాడులో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలనీ స్థానికులు కోరుతున్నారు. సంఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.