పల్నాడు జిల్లా : ఎన్నికల అనంతరం మాచర్ల నియోజకవర్గం పరిధిలోని కారంపూడిలో ఘర్షణలు తలెత్తాయి. దీంతో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కాసేపట్లో మాచర్ల రానున్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉండటంతో ఎస్పీ మాచర్లలోనే మకాం వేస్తారట. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకు ఆయన అక్కడే ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.