భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా భద్రాద్రి ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల అధ్యక్షుడు రేగళ్ళ సుధాకర్ ఆధ్వర్యంలో చర్ల సీఐ అశోక్, ఎస్ఐ వెంకటప్పయ్య సంయుక్తంగా 2016 దివ్యాంగుల నూతన చట్టం పోస్టర్ను అవిస్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ దివ్యాంగులను కించపరిచినా, హేళన చేసినా, అవమానించినా, దాడి చేసినా, దివ్యాంగుల సహాయ పరికరాలను ధ్వంసం చేసినా, వారిని హేళన చేస్తూ సైగలు చేసినా 2016 దివ్యాంగుల నూతన చట్టం లో 92/A ప్రకారం 6 నెలల నుండి 2 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా 5 లక్షల నష్టపరిహారం చెలించవలసి ఉంటుందని తెలిపారు. సమాజంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న దివ్యాంగులను ప్రోత్సహించడం మన కర్తవ్యం అని వాళ్లను కూడా సమాజంలో గుర్తించే విధంగా చేయూతను అందించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరు సాయిరాం, అన్నం సత్తిబాబు, రామ రుద్రయ్య, మేడ మెట్ల సురేష్ రెడ్డి, చైతన్య, ఆనంద్, రమేష్, రఘుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు