మదనపల్లి : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని మదనపల్లి పట్టణంలో వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి తమదంటూ రౌడీయిజం చేస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నారు. పట్టణంలోని రామారావు కాలనీలో నివాసం ఉంటున్నటువంటి టిడిపి కార్యకర్త అయిన కప్పల ఆనంద్ కు సంబంధించిన వంశపారపరమైన ఆస్తిపై వైసిపి నాయకులు అయినటువంటి హర్ష తమ్ముడిని అంటూ చలామణి అవుతున్న వ్యక్తి దాదాపు 20 మంది యువకులను వెంటబెట్టుకొని భూ ఆక్రమణకు పాల్పడ్డారు. ఇదేమని ప్రశ్నించిన భూ యజమానిని మరియు తన కుటుంబ సభ్యులను అసభ్యకరంగా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితులకు పోలీస్ ఉన్నతాధికారులకు వైసీపీ నాయకుల మాటలకే వత్తాసు పలకడం గమనార్హం.
