విశాఖపట్నం – లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బుధవారం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విశాఖ నుంచి బయలుదేరిన కాసేపటికే ట్రైన్ కు అటాచ్ చేసిన ఏసీ బోగీల లింక్ తెగిపోయింది. ట్రైన్ నుంచి రెండు ఏసీ బోగీలు వేరయ్యాయి. గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలట్ ను అప్రమత్తం చేయడంతో ట్రైన్ నిలిచిపోయింది. అనంతరం జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను తిరిగి విశాఖ స్టేషన్ కు తరలించారు. ఏసీ బోగీల లింక్ తెగిపోవడానికి కారణం గుర్తించడంతో పాటు తిరిగి వాటిని లింక్ చేసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాక జన్మభూమి ఎక్స్ ప్రెస్ తిరిగి బయలుదేరుతుందని రైల్వే సిబ్బంది అనౌన్స్ చేశారు.
