- కారంపూడి సచివాలయంలో దొంగలు పడ్డారు
- కంప్యూటర్ ఎత్తుకెళ్ళిన దుండగులు
పల్నాడు జిల్లా , కారంపూడి : కారంపూడి 1 సచివాలయంలో దొంగలు పడ్డారు. స్థానిక బస్ స్టాండ్ సెంటర్ లోని సచివాలయంలో దుండగులు కంప్యూటర్ ను ఎత్తుకెళ్లినట్లు పంచాయతీ సెక్రటరీ కాసిన్య నాయక్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించిన తరువాత యదా ప్రకారం తాళం వేసి వెళ్లడం జరిగిందని తిరిగి మరలా ఉదయం విధులలోకి సిబ్బంది వచ్చే సరికి తాళం తీసి చూడగా కంప్యూటర్ మాయం అయినట్లు గుర్తించారు. వెంటనే సిబ్బంది సెక్రటరీకి సమాచారం అందించారాని వేసిన తాళం వేసినట్లుగానే ఉండి సచివాలయంలో ప్రభుత్వంవారు ఇచ్చిన కంప్యూటర్ దొంగతనానికి గురికావడం అధికారులను, సిబ్బందిని ఆశ్చర్య పరుస్తుంది. సమీపంలోని సీసీ ఫుటేజ్ లను పంచాయతీ కార్యదర్శి పరిశీలిస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా కంప్యూటర్ ను దొంగలు ఎత్తుకెల్లారా లేక ఇంటి దొంగలే మాయం చేసారా అనే సందేహం ఈ సిబ్బందిలో నెలకోని ఉంది. ఈ విషయమై స్థానిక పోలీసు స్టేషన్ లో కూడా పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.