గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా కొనసాగుతుండగా… నగరంలో బీజేపీ తన బలాన్ని అనూహ్యంగా పెంచుకుంది. మరోవైపు ఓల్డ్ సిటీలో ఎంఐఎం తనకున్న పట్టును నిలుపుకుంటోంది. ఫలక్ నుమా సర్కిల్ లో ఎంఐఎం జెండా ఎగిరింది. ఈ సర్కిల్ లోని ఆరు స్థానాలు దూద్ బౌలి, కిషన్ బాగ్, రాంనాస్త్ పురా, జహానుమా, నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్ నుమా స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.మరోవైపు చాంద్రాయణగుట్ట సర్కిల్ లో కూడా క్లీన్ స్వీప్ దిశగా ఎంఐఎం దూసుకెళ్తోంది. ఇప్పటికే చాంద్రాయణగుట్ట సర్కిల్ లోని బార్కాస్, కాంచన్ బాగ్, చాంద్రాయణగుట్ట, రియాసత్ నగర్ డివిజన్లలో గెలుపొందింది. ఈ సర్కిల్ లోని ఉప్పుగూడ, లలితాబాగ్, జంగమ్మెట్ డివిజన్లలో ఫలితం వెలువడాల్సి ఉంది.