కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లో జరిగే వారసంత కు అన్ని రకాల వసతులు కల్పించాలని సోమవారం భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు (సిపిఐ )మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వారం వారం జరిగే వారసంత లో కనీసం వసతులు లేవని మహిళలకు కనీసం మరుగుదొడ్లు మూత్రశాలల లేవని దీనివలన మహిళల గౌరవనీకి భంగం కల్గుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. మరియు వాటర్ ప్లాంట్ చాలా రోజులు గా మూత పడ్డాయాని తద్వారా నీటికి చాలా రకాలు గా ఇబ్బందులు పడుతున్నారు. అని మండిపడ్డారు. అన్ని రకాల వసతులు కల్పించేంతవరకు గ్రామ పంచాయతీ అన్ని రకాల టెండర్ రద్దు చేయాలి అని సిపిఐ నాయకులు డిమాండ్ చేసారు. అన్ని రకాల వసతులు కల్పించిన తర్వాత టెండర్ వేయాలి అని అన్నారు. లేని పక్షం లో ఆందోళన చేస్తామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతల అంజిరెడ్డి, మండల సహాయ కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, యువజన నాయకులు మొలుగురి ఆంజనేయులు మండల నాయకులు బోయిని మల్లయ్య, కూన మల్లయ్య, మీసం రాములు తదితరులు పాల్గొన్నారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/DELHI-EXIT-POLL-RESULTS-2025_-ఆప్_నకు-షాక్-ఈసారి-హస్తినలో-BJPకే-పట్టం.webp)