తిరుమలలో గత 50 సంవత్సరాలగా జీవిస్తున్న శ్రీనివాసులు రెడ్డి , గురమ్మ అనే దంపతులకు ఒక కుమారుడు, కుమారుడు వృద్ధాప్యంలో చూసి కడతేరుస్తారని తన పేరు మీద ఉన్న ఆస్తిని కుమారుడి పేరు మీద వ్రాసి ఇచ్చి శేష జీవితం సాఫీగా గడుపుదామని అనుకున్నాడు. ఇంతలో విధి ఆడిన నాటకంలో కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. మరణించిన వెంటనే టీటీడీ దేవస్థానం రెవెన్యూ ఆఫీసులో భర్త పేరు పైన ఉన్న ఆస్తిని కోడలు పేరు మీద గా మార్చుకొని తాళం వేసుకొని తన అమ్మగారి ఇల్లు అయినటువంటి రాజమండ్రి కి వెళ్లిపోయింది. ఈ వృద్ధ దంపతులకు కనీసం తాళం ఇవ్వకుండా రోడ్డుపైన జీవిస్తున్నారు. తిండి లేక శ్రీనివాసరెడ్డి మరణించాడు, అనాధ శవంగానే పడి ఉన్నారు. రోడ్డుపైన అంత్యక్రియలు జరపవలసిన దుస్థితి వచ్చింది. చుట్టుపక్కల వారు సహాయ సహకారాలతో అంత్యక్రియలు చేయవలసి వచ్చింది. టీటీడీ వారు ఈ వృద్ధ దంపతులకు తగు న్యాయం చేయవలసిందిగా తిరుమల గ్రామ ప్రజలు టీటీడీ దేవస్థానాన్ని కోరడమైనది. మరి దేవస్థానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.