కరీంనగర్ జిల్లా: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ముస్కు ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మేర రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్, గన్నేరువరం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి,బీసీ సెల్ మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముడికే అజయ్, మాజీ సర్పంచ్ దుడ్డు మల్లేశం, మాజీ ఉప సర్పంచులు బద్దం సంపత్ రెడ్డి, బూర వెంకటేశ్వర్,మాజీ సర్పంచ్ రాజయ్య,నాయకులు వేదిరే విజేందర్,నక్క అంజయ్య,పాకాల పరశురాం, రాపోలు నవీన్, బుర్ర మల్లేష్ గౌడ్, మైసంపల్లి తిరుపతి,కూన శ్రీధర్ ,నక్క తిరుపతి, రంగన వేణి వీరయ్య, గడ్డం మైపాల్ రెడ్డి, రాపోలు హరీష్, కూన యాదగిరి,అకేన వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.