ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2024లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. చారిత్రాత్మకంగా 165 సీట్లను కూటమి పార్టీలు దక్కించుకోవడం ఖాయమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ స్పందించారు. ‘‘ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి నా అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి లో సరికొత్త రికార్డును సృష్టించాలని కోరారు.
https://x.com/Sudhakarpress/status/1798006797405745484
AP Elections 2024: భవిష్యత్ కి బాటలు వేసుకోండి… ఎన్నికల్లో సరైన నాయకుడ్ని ఎన్నుకోండి : వి. సుధాకర్