కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలో గ్రామపంచాయతీ ఆధీనంలో గల 17 దుకాణ సముదాయాలకు ఈ నెల 12వ తేదీన గ్రామపంచాయతీ ఆవరణలో ఉదయం 10 గంటలకు ఎంపీవో నరసింహారెడ్డి అధ్యక్షతన వేలం నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేష్ శనివారం తెలిపారు. వేలంలో పాల్గొనేవారు ముందుగా పదివేల రూపాయలను 12వ తేదీ ఉదయం 8 నుంచి 10 గంటల లోపు డిపాజిటివ్ చేసిన వారిని అర్హులుగా గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. వేలంలో దుకాణాలు దక్కించుకున్న వారు జూన్ 12వ తేదీ నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు అర్హత ఉంటుందని తెలిపారు.
వారసంత వేలం గన్నేరువరం మండలకేంద్రంలో కూరగాయల వార సంత నిర్వహణకు ఈనెల 12వ తేదీన ఎంపీ ఓ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 11:30 నిమిషాలకు గ్రామపంచాయతీ ఆవరణలో వేలం నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేష్ శనివారం తెలిపారు. ఈ వేళలో పాల్గొనేవారు 12వ తేదీ 10 గంటల లోపు రూ.5 వేల ధరావత్ ను చెల్లించిన వారే అరువులుగా గుర్తించడం జరుగుతుందన్నారు.
