మంచిర్యాల జిల్లా.. చెన్నూరు శాఖ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)చేసిన నిర్లక్ష్యానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) పరిక్ష రద్దు కావడం జరిగింది. దీనికి నిరసనగా ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెన్నూర్ లోని పాత బస్టాండ్ లో ధర్నా కార్యక్రమాన్ని జరిపారు ఏబీవీపీ నాయకురాలు మామిడి అక్షిత మాట్లాడుతూ సంవత్సరాలు కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని అన్నారు .అధికారులు స్వప్రయోజనాల కోసం చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వాంపైన నింద పడుతుందని అన్నారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేయాలని
అదేవిధంగా ఈకేసు సిబిఐకి అప్పగించాలని అన్యాయానికి గురైన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు కార్యక్రమంలో నగర కార్యదర్శి తిరుపతి ,ఏబీవీపీ కార్యకర్తలు రాజ్ కుమార్ ,శివకుమార్, దివ్య ,శశిధర్ తదితరులు పాల్గొన్నారు
