ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కోసం టాలీవుడ్ నిర్మాతలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. వీరిలో అశ్వనీదత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తదితరులు ఉన్నారు.
నేటి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ వారితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వారు పవన్‌కు వివరిస్తారు. సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుతోపాటు, థియేటర్ల సమస్యపైనా పవన్‌తో చర్చిస్తారు.