పల్నాడు జిల్లా, మాచర్ల : యువకులు క్రీడా స్ఫూర్తితో తమలో దాగివున్న ప్రతిభను నైపుణ్యాన్ని వెలికి తీసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం మాచర్ల పట్టణంలోని బంగ్లా క్రికెట్ మైదానంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అన్వర్ బాషా ఆధ్వర్యంలో జూలకంటి నాగిరెడ్డి మెమోరియల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకొని క్రికెట్ బ్యాట్ చేతబట్టి ఆటలను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతిగా 1,3318 రెండో బహుమతి 93,318 మూడో బహుమతి 63,318 నాలుగో బహుమతిగా 33,318 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పదివేల రూపాయలు బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొమ్మెర దుర్గారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ అన్వర్ భాష అక్కిరెడ్డి నాగూర్ భాష ఓర్సు క్రాంతి రామ టాకీస్ జానీ ఖాజా కుమార్ మదీన్ లాలా వినోద్ శ్రీ వాత్సవ్ కరీం సమీర్ తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.