చిత్తూర్, మదనపల్లె : రాష్ట్ర రవాణా మరియు క్రీడాభివృద్ధి శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి భార్యపై వచ్చిన వార్తను, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్ మరియు యువ నాయకులు కంచర్ల చింటూ తిప్పి కొట్టారు. సోమవారం రాయచోటి నియోజకవర్గం లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆలస్యం కావడంతో చిన్నమండెం ఎస్సై రమేష్ బాబుపై మంత్రి భార్య అసహనం వ్యక్తం చేయడం నిజమేనని, పోలీసు అధికారులపై దురుసుగా వ్యవహరించలేదని అలాంటి సంప్రదాయం తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదన్నారు. వైసిపి నాయకులే తమ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.