నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్ లో అడవి దున్న కెమెరా ట్రాప్లో కనిపించింది. 1870 తర్వాత అడవి దున్న ఇక్కడ కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది సైతం ఆశ్చర్య పోతున్నారు. వెలుగోడు రేంజ్ లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవిదున్నను గుర్తించామని.. అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు.