కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం వాసు గౌడ్ ఆహ్వానం మేరకు రేణుకా ఎల్లమ్మ తల్లీ సిద్దోగం మహోత్సవ వేడుకలకు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి హాజరై అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ… వర్షాలు సకాలంలో సమృద్ధిగా పడి, పాడి పంటలు పండి పశు సంపదలతో ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకుంటున్నారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు, గుగ్గిళ్ల కార్తీక్ రజక తదితరులు పాల్గొన్నారు.