హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగంకు ది కౌన్సిల్ ఆఫ్ సైటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ప్రతిష్టాత్మక పరిశోధన ప్రాజెక్టును మంజూరు చేసినట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
‘కాస్కేడ్ ఉత్ప్రేరకము ద్వారా కోఎంజెమ్ పునరుత్పత్తితో సమన్వయ ఫోటో- బయోక్యాటలిటిక్ హైడ్రోజన్: ఉత్పత్తి’ పేరిట చేపడుతున్న ఈ పరిశోధన ప్రాజెక్టు 36 నెలల వ్యవధిలో పూర్తిచేయాలని సీఎస్ఐఆర్ వర్గాలు స్పష్టీరించినట్టు తెలిపారు. యాస్నెర్ పథకం కింద ఈ పరిశోధనకు గాను రూ.25.42 లక్షల గ్రాంటును మంజూరు చేశారని, డాక్టర్ గౌసియా బేగం ఈ ప్రాజెక్టుకు ప్రధాన పరిశోధకురాలిగా వ్యవహరిస్తారన్నారు.
ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ)తో పాటు లెక్చర్షిప్ (నెట్) లేదా గేట్ అర్హత సాధించిన వారు ఈ ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)గా పనిచేయవచ్చని, వారికి నెలకు రూ.37 నేల స్టయిఫండ్ లభిస్తుందని తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం డాక్టర్ గౌసియాను 70933 41504లో సంప్రదించాలని, లేదా qbegum@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
సీఎస్ఐఆర్ నుంచి పరిశోధనా ప్రాజెక్టు పొందిన డాక్టర్ గౌసియా బేగంను గీతం హైదరాబాద్ అదనపు: ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్. డాక్టర్ ఎం.జి తదితరులు అభినందించి, గడువులోగా పరిశోధనను పూర్తిచేయమని సలహా ఇచ్చినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.