పల్నాడు జిల్లా, కారంపూడి : పిడుగురాళ్ల నుండి గురజాలకు వయా కారంపూడి ఆర్టీసీ బస్ సర్వీసులు నడపాలని స్థానికులు కోరుతున్నారు. కారంపూడి నుండి గురజాలకు వెళ్లడానికి ప్రజలు బస్సు కొరకు నానా అగచాట్లు పడుతున్నారు. పల్నాడు జిల్లా కాకముందు కారంపూడి నుండి గురజాలకు రెండు ఆర్టీసీ బస్సులు నడిచేవి ఇప్పుడు పల్నాడు జిల్లా అయ్యాక కనుమరుగయ్యాయి. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి గురజాల వెళ్లాలంటే బస్సులు లేక చుక్కల చూడవలసి వస్తుంది. కారంపూడి నుండి గురజాల వెళ్లాలంటే ఆటో వారి బాదుడికి తట్టుకోలేకపోతున్నారు. కోర్టు, ఆర్డిఓ ఆఫీసు, డిఎస్పి ఆఫీసు, రిజిస్టర్ ఆఫీసు కు వెళ్లాలంటే అనుకున్న సమయానికి చేరలేకపోతున్నారు. కావున ప్రజల పై దయ ఉంచి మాచర్ల శాసనసభ్యులు స్పందించి బస్ సర్వీసులు నడిపేవిధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు