contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దమ్ముంటే మాచర్ల కు రా .. మీ సుద్దపూస అక్రమాలు ఆధారాలతో చూపిస్తా : జగన్ కి జూలకంటి కౌంటర్

  •  దమ్ముంటే మాచర్ల కు రా… మీ సుద్దపూస అక్రమాలు ఆధారాలతో చూపిస్తా…
  • జగన్ తో నీతులు చెప్పించుకునే స్థితిలో లేము
  •  పాత కేసు లు అన్ని తిరగతోడుతాం
  •  అక్రమాలకు అండగా నిలిచిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే

 

పల్నాడు జిల్లా, మాచర్ల : పులివెందుల ఎమ్మెల్యే దమ్ముంటే మాచర్ల కు వస్తే మీ సుద్దపూస ఉంగరాల బ్రదర్స్, గుడుంబా శంకర్ లు మాచర్లను చెర పట్టిన అక్రమాలు అన్యాయాలు ఆధారాలతో సహా చూపిస్తానని ఓ వేదిక ఏర్పాటు చేయమంటావా అంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పై దాడులు జరుగుతున్న సమయంలో చిక్కటి చిరునవ్వులు చిందించిన జగన్ తన దోపిడి ముఠాలో సభ్యుడికి కబ్జాకోరు కు అన్యాయం జరిగిందంటూ బయటకు వచ్చి మాట్లాడటం మాజీ ముఖ్యమంత్రి కి సిగ్గుచేటు అన్నారు. జగన్ తో నీతులు చెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లేరని అన్నారు. ప్రజలకు మంచి చేసినా తాను ఓడిపోయారని చెప్పటం జగన్ దివాలాకోరు తనానికి నిదర్శనం అన్నారు. ఏ వర్గానికి న్యాయం చేశాడు చెప్పాలన్నారు యువతను గంజాయి కు బానిస చేసి గంజాయి మాటున వ్యాపారం చేసి వైసిపి నాయకులు కోట్లు గడించారని అన్నారు. అమరావతిపై కక్షగట్టి భావన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న అనేకమంది బడుగు బండా హీనవర్గాల వారి పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దివాలా తీయించిన ఘనత జగన్ అని అన్నారు. రైతులకు గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని 3500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటానని వాగ్దానం చేసిన జగన్ ఎంతమంది రైతులని ఆదుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు పాలు చేసి ఆగాధం సృష్టించారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క ఎకరాకైనా సాగు నీరు ఇచ్చావా జగన్ అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని మాచర్ల లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నీ రౌడీ మూకలతో దాడులు చేయించి ధ్వంసం చేయించావు ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చి సైకో ఆనందం పొందిన జగన్ మా పార్టీ ఆఫీసులపై ధ్వంసం చేసి దాడులు చేసిన వారిపై కేసులు పెడితే నేటి వరకు చర్యలు లేవు అని వీటిపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. పాత కేసులన్నీ తిరగ తోడుతామని వైసిపి అవినీతి అక్రమాలకు కబ్జాలకు తొత్తులుగా ఉన్న అధికారులు విచారణ ఎదుర్కొక తప్పదు అన్నారు. జగన్ ఉడత ఊపులకు తెలుగుదేశం పార్టీ భయపడదు అని అన్నారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్నావ్ వారు ఏ స్థాయిలో ఉన్న ఎంతటి వారైనా వారి సహకరించిన వారు సైతం జైలుకు వెళ్లక తప్పదు అని అన్నారు. 99 శాతం హామీలను అమలు చేసిన ఓడిపోయినాము అంటున్న జగన్ ఆ ఒక్క శాతం హామీ ఏమిటో ప్రజలకు తెలిపితే మేము తెలుసుకుంటామని అన్నారు. వైసీపీలో దోపిడీ చేయటమే మంచితనమా… గ్రానైట్ ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు దోపిడీ చేసిన వ్యక్తిని మంచివాడు శుద్ధ పూస అంటూ మాట్లాడిన జగన్ తన యొక్క నైజాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో అవమానాలు వేధింపులు దాడులకు గురయ్యారని కానీ మా అధినేత ఆదేశాల మేరకు ఎక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదని అన్నారు. నువ్వు చేసిన విధానాలు మా పార్టీ అధినేత అవలంబిస్తే ఇప్పటికే వైసిపి కార్యకర్తలు నాయకులు రాష్ట్రం విడిచి వెళ్లి ఉండేవారని అన్నారు. నెలరోజులు కూడా పూర్తిగానే ప్రభుత్వంపై అభండాలు వేయటం వారి రాజకీయ పరిపక్వతకు నిదర్శనం అన్నారు. ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శకు వెళ్ళాడు అని జగన్ అనటం ప్రజలను అమాయకులను చేయటమేనన్నారు పరామర్శలకు వెళ్లేవారు కత్తులు రాడ్లు , గొడ్డళ్లు, బీరు బాటిళ్లు తీసుకుని ముఖాలు కనిపించకుండా మారువేషాలలో వెళ్తారా అని ప్రశ్నించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :