- 1 లక్ష రూపాయిలు నష్టపోయిన గిరిజన రైతు
- చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ ఎదురు
- 3 అడుగుల ఎత్తులో 11కె వి విద్యుత్ లైన్లు..
- ఆవుల స్థానం లో మనుషులు ఉంటే ?
- ఊహే భయంకరం గా ఉంది..
- అమాయక గిరిజనులను మోసం చేసి రాజి.
ఆలస్యంగా వెలుగులోకి…
కారంపూడి – పల్నాడు జిల్లా : కారంపూడి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి 2 మూగ జీవాలు బలి అయ్యాయి. సన్నెగండ్ల తండాకు చెందిన గిరిజన రైతు వ్యవసాయానికి ఉపయోగించే ఆవులను చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న కొండల్లోకి మేత కు తీసుకువేళ్ళారు. మేత మేసిన ఆవులను తిరిగి ఇంటికి తీసుకువెళుతుండగా 11 కేవీ కరెంటు తీగలు నేలకు 3 అడుగుల ఎత్తులో ఉన్నడటంతో తీగలను దాటే క్రమంలో కరెంట్ తీగలు తగిలి అక్కడికక్కడే 2 మూగ జీవాలు చనిపోయినవి. గిరిజన రైతుకు వ్యవసాయంలో అండగా ఉండే పశువులు మృత్యువాత పడటంతో ఆ రైతు బాధ వర్ణనాతీతంగా ఉంది.
ఇదంతా ఆ సెక్షన్ విధులు నిర్వర్తించే సిబ్బంది నిర్లక్ష్యమే కారణం ఎన్నో ఏళ్లుగా రైతుకు తోడుగా ఉన్న ఆవులను కోల్పోయి సుమారు 1 లక్ష రూపాయి లు ఆ గిరిజన రైతు నష్టపోయాడు. అందులో ఒక ఆవు ఈనెందుకు సిద్ధంగా ఉంది. ఒక ఆవుకు లేగ దూడ ఉంది.
మండలంలో ఆర్డీఎస్ రూరల్ అభివృద్ధి పధకం సంబంధించి పనులు జరుగుతున్నాయి పాత కరెంట్ స్తంభాల స్థానంలో కొత్త స్తంబాలు, స్తంభాల వద్ద జంగిల్ క్లియర్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. గత కొద్ది రోజుల క్రితం మూగ జీవాలు చనిపోయిన ప్రదేశంలో ఉన్న 11 కేవీ లైన్ వద్ద ఉన్న జంగిల్ క్లియర్ చేశారు. అప్పుడు కరెంట్ సిబ్బంది కి లైన్ కిందకు ఉందని తెలుసు, చూసారు. కాని ఆ లైన్లను మరమ్మతులు చేయకుండా విధులను నిర్లక్ష్యం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వలన ఒక గిరిజన రైతు తన రెండు ఆవులను పోగొట్టుకొని మూల్యం చెలించుకున్నాడు.
మూగ జీవాల స్థానంలో ప్రజలు ఉంటే పరిస్థితి ఏమిటి ?
అక్కడ ఉన్న కొండల్లోకి మేత కోసం జీవాలను తీసుకొని రైతులు వస్తుంటారు. జీవాలకు బదులు ఆ కరెంట్ తీగలు రైతుకు తగిలి ప్రాణ నష్టం జరిగితే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారు. ఆ రైతు కుటుంబ పరిస్థితి ఏమిటి? ఇదంతా ఆలోచిస్తే ఊహే భయానకంగా ఉంది.
రాజి ప్రయత్నాలు
ఈ ఘటన బయటకు రాకుండా చేసేందుకు ఆ అమాయక గిరిజన రైతును మభ్యపెట్టి రాజి ప్రయత్నాలను కరెంట్ సిబ్బంది చేశారు. కరెంట్ సిబ్బంది రాజకీయ నాయకులను సంప్రదించి వారి ద్వారా ఈ ఘటన నుండి బయట పడేందుకు రైతు తో రాజి చేసినట్లు విశ్వస నీయ సమాచారం. మరి ఈ దుర్ఘటన ఆలస్యంగా నాలుగు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.
ఈ దుర్ఘటన పై కరెంట్ ఉన్నత అధికారులు విచారణ చేసి బాధ్యులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటారా లేక చనిపోయింది 2 మూగ జీవాలే కదా, సిబ్బంది కి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనకెందుకులే అని నిశ్శబ్దంగా ఉంటారో ప్రజలు గమనిస్తూ ఉంటారు.