ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్ తగిలింది. ఆయనపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదయింది. ఇప్పటికే ఆయనపై ఒకట్రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
తాజా కేసు వివరాల్లోకి వెళ్తే… తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నానితో పాటు ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసిన మాధవీలత రెడ్డి (ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్)లను కూడా తన ఫిర్యాదులో ఆయన నిందితులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 448, 427, 506, ఆర్ అండ్ డబ్ల్యూ 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.