సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్: నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ Dr. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా అమీన్ పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీరంగూడ కామన్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతస్థానాన్ని పొందిన, ప్రజల నాయకుడు కాంగ్రెస్ పార్టీ ముదుబిడ్డ స్వర్గీయ Dr. రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు మరవానియనివి ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నాడు ఆయన మొదలు పెట్టిన సంక్షేమ పథకాలు కార్యక్రమాలే నేడు కొనసాగుతున్నాయి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ వారు సంక్షేమ పథకాలు ఆయన బాటలో నడుస్తున్నాయి కావున నేడు ఆయనను స్మరించుకుంటున్నం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మున్న, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, మున్సిపల్ జనరల్ సెక్రటరీ లు రమేష్ , మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్, సతీష్, ఎల్లయ్య, ఈశ్వర్ రెడ్డి, లక్ష్మీకాంత్, మల్లేష్ యాదవ్, వెంకట్, సుక్కారెడ్డి,భిక్షపతి, రామచందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి,కృష్ణ , అప్ప రావు, గోపాల్ రెడ్డి,శ్రీకాంత్‌రెడ్డి,సురేష్,మల్లేష్, గోవిందు,నగేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు.