- దళారీ వ్యవస్థ పోయి ఉచిత ఇసుక విధానం
- భవన నిర్మాణ కార్మికుల్లో ఆనందం
- మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా
అన్నమయ్య జిల్లా, మదనపల్లి : : ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికుల్లో ఆనందం నెలకొందని, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుకను అందివ్వడం చాలా సంతోషకరమని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. మంగళవారం బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.పేదలకు ఉచిత ఇసుక విధానంను ప్రభుత్వం సోమవారం నుంచి అమలు చేయడంతో మదనపల్లె బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ (భవన నిర్మాణ కార్మికులు) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను తీసుకోవాలంటే దళారుల వ్వవస్థ వల్ల అదనపు బారంతో అప్పుల పాలయ్యారని తెలిపారు. ఇక నుంచి ఇసుకను రీచ్‌ల వద్ద ప్రభుత్వం నిర్దేశించిన రవాణా ఖర్చులను లబ్ధిదారుడు భరిస్తే నేరుగా ఇంటికి ఇసుక చేరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు రెడ్డి సాహెబ్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.