కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గన్నేరువరం ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గన్నేరువరం తాశీల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ బిక్షపతి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల కన్వీనర్, గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ యాదవ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సుంకరి సంపత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని హామీలను అమలు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టో ఇచ్చిన హామీలు మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇవ్వాలని ఖరీఫ్ సీజన్ రైతు భరోసా సాయం 7500 అన్నదాతకు అందించాలని వ్యవసాయ కూలీలకు 12000, కౌలు రైతులకు 15000 నేరుగా అకౌంట్లో వేయాలని ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ నిర్ణీత గడువులోగా చేయాలని. డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని ఇంటి స్థలం లేని వారికి 200 గజాల స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలని అన్నారు. నిరుద్యోగ భృతి 3116 ప్రతి నిరుద్యోగి అకౌంట్లో వేయాలని. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు రైతులకు పంట బోనస్ 500 ప్రకటించి అమలు చేయాలని గృహ జ్యోతి అమలు,ధరణి భూ సమస్యలు పరిష్కరించాలని అలాగే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీని అరికట్టాలని అన్నారు. సమస్యల పరిష్కరం కోసం ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జీల ఎల్లయ్య యాదవ్, మండల నాయకులు పాశం వేణు యాదవ్,ముడికే శ్రీనివాస్ యాదవ్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.