పల్నాడు జిల్లా,బొల్లాపల్లి : ట్రాక్టర్ బోల్తా పడ్డ సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే బొల్లాపల్లి మండలం జయంతిరామపురం గ్రామానికి చెందిని బిక్షం కోటేశ్వరావు (30) తండ్రి వెంకటేశ్వర్లు, పొలం దగ్గరకి ట్రాక్టర్ తీసుకొని వెళుతుండగా మార్గమధ్యలో అదుపుతప్పి ట్రాక్టర్ తిరగబడి మరణించాడు. వెనకాల కూర్చున్న మోజీల నాగేంద్రబాబు, రుద్ర సంజీవయ్య లకు తీవ్ర గాయాలయ్యాయి. బిక్షం కోటేశ్వర రావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని ప్రభుత్వం స్పందించి కోటేశ్వర రావు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు