కరీంనగర్ జిల్లా: జార్ఖండ్ ఆదివాసీల హక్కుల ఉద్యమ నేత,మానవ వనరులు, మానవ హక్కు పరిరక్షణకు పాటుపడుతున్న ఫాదర్ స్టాన్ స్వామి(82) అనే క్రైస్తవ గురువును అక్కడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం రేకుర్తిలోని లయోలా బీఈడీ కళాశాల ఎదుట లయోలా విద్యాసంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఫాదర్ స్టాన్ స్వామి అరెస్టు అక్రమమని, వెంటనే అతడిని బేషరతుగా విడుదల చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో లయోల విద్యాసంస్థల అధ్యాపకులు ఫాదర్ అలక్ష్, ఫాదర్ప్రశాంత్ రెడ్డి,ఫాదర్ నరేశ్,ఫాదర్ జోసెఫ్, రోమన్ క్యాథలిక్ లు, విద్యార్థులు పాల్గొన్నారు.