సంగారెడ్డి జిల్లా , అమీన్ పూర్ : ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సొసైటీకి చెందిన అమీనాపూర్ బీరంగూడ నర్రెగూడ అండ్ తెల్లాపూర్ విలేజస్ ప్లాటు పర్చజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 42 సంవత్సరాలనుండి సుదీర్ఘ న్యాయ పోరారటం చేస్తున్న మాకు హైకోర్టు తీర్పులను పరిగణలోనికి తీసుకొని మానవతా దృక్పధంతో ప్రభుత్వం న్యాయం చేయాలనీ సభ్యులు కోరారు.
వాలా నారాయణరావు అధ్యక్షునిగా 1980 లో ఏర్పాటైన సొసైటీకి షుమారు 8500 మంది సభ్యులుగా చేరి 300,350,400,500 గజాల ప్లాట్లుగా చేసి 1982 గ్రామపంచాయతీ అనుమతులు, జిల్లా రెవిన్యూ అధికారులు ల్యాండ్ కన్వెర్షన్, ఎన్. ఓ.సీ ఇవ్వడంతో సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలములో రిజిస్ట్రేషన్ చేసుకొనుట జరిగింది. అప్పటివరకు సొసైటీకి చెందిన భూములన్నీ రెవిన్యూ రికార్డు పరంగా పట్టా భూములుగానే నమోదు చేయబడి ఉన్నవి. అప్పటి ప్రభుత్వం 88 ఎకరాల భూమిని ఓ కన్స్ట్రక్షన్ అకాడమీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకొనుట, దానిని సొసైటీ హైకోర్టులో సవాలు చేయడంతో ఎదాస్థితి కొంసాగించాలని ఆర్డర్ ఇచ్చారు. దీనితో దృష్టిలో పెట్టుకొని మామీద కక్షసాధింపు కార్యక్రము మొదలైంది.
దేనితో 1996 లో అప్పటి తహసీల్దారు అభ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, ప్రభుత్వం ఎర్నేని సీతాదేవి అధ్యక్షతన 19 మందితో కూడిన హౌస్ కమిటీని నియమించడం, 1999 లో కమిటీ గోవేర్నమేంటు అసైండ్ కూడా ఉన్నాయని. ఇట్టి భూములు సొసైటీకి అమ్మిన రైతులు భూమిలేని నిరుపేదలు కాదు, సొసైటీ రైతుకు మార్కెట్ విలువకు కొనుగోలు చేసింది. కావున ప్రభుత్వ రెవిన్యూ అధికారులు చేసిన తప్పిదాలవలన తెలియక మోసపోయిన కొనుగోలుదారులకు 1985-1995 మధ్యగల ప్రభుత్వ విలువ ఆధారంగా వారికే రెగ్యులరైజ్ చేయవచ్చని తుది నివేదికలో సిఫారసు చేయడం జరిగింది. అప్పటివరకు సొసైటీని జి. ఓ ఎం. ఎస్ నం. 1077/2002 ద్వారా జిల్లా కలెక్టర్ ఆదినములో ఉంచి దానికి పర్సస్ ఇంచార్జ్ గా డి. ఆర్. ను నియమించడం జరిగింది.
దానికి సవాలు చేస్తూ W. P NO. 19673/2006 తోపాటు పలు కేసులను హైకోర్టులో వేయడం 21-02-2014 వాటినాన్నింటికి ఒక కామన్ ఆర్డర్ ద్వారా తీర్పును ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రెవిన్యూ అధికారులు చాలా నీచంగా వ్యవరించారని, వారిచ్చిన అన్ని అనుమతులతో తెలిసో తెలియక ప్లాట్లు కొనుగోలు చేశారు. ప్రైవేటు పట్టా భూములను బే షరతుగా రిలీజ్ చేయాలనీ, మాజీ సైనికులకు కేటాయించిన భూముల విషయంలో నిర్నిత తగడువును పరిగణలోకి తీసుకోవాలని, ఒకవేళ ప్రభుత్వ అసైండ్ భూములుంటే హౌస్ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకొని 1985-1995 మధ్య మార్కెట్ విలువను వసూలు చేసి ప్లాటు కొనుగోలు దారులకు న్యాయం చేయాలనీ 90 రోజులలోపు తీర్పును అమలు చేయాలనీ హై కోర్టు తీర్పులో పేర్కొన్నారు. కానీ ఇప్పటికి అమలు కాకపోవడంతో మేము పలు విధాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాము. కోర్ట్ దిక్కరణ కేసు హిసోకార్టులో నడుస్తుంది.
ఇటీవల నిషేధిత జాబితానుండి తొలిదాలని హై కోర్టులో కేసు వేయగా తీర్పు వచ్చింది. దానిని ప్రభుత్వం అమలు చేయకపోగా వివిధ న్యాయస్థానాల్లో వివాదములోనున్న మా సొసైటీ ప్లాట్లలో అమీనాపూర్ సర్వే నెంబర్. 1000 లో అటవీ శాఖ సహకారముతో చెట్లు నాటే కార్యక్రమానికి పునుకోవడం అత్యంతదారుణమని. ఇలాంటి హేయమైన చెర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అసోసిషన్ అధ్యక్షులు ఆడుసుమల్లి వెంకటేశ్వర్లు తెలిపారు . సర్వే నుంబర్లు 990 నుండి 997 లలో నోటరే ద్వారా 100 గజాలలో రూము, విద్యుత్తుతో ఓ దూరక్రాందరుడు కబ్జా చేస్తుంటే రెవిన్యూ వారు తాత్కాలిక కూల్చివేతలతో చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికి షుమారు 20 ఎకరాలు అన్యాక్రాంతానవుతుంది. కొందరు రాజకీయనాయకుల అండతో మా సొసైటీ వివాదాస్పద ప్రభుత్వ వివాదాస్పద భూములలో ప్రైవేట్ సర్వే నుంబర్లు వేసి ఏదేచ్చగా కబ్జాలు చేస్తున్నారని రెవిన్యూ అధికారులకు విన్న వించినా ప్రయోజనం సూన్యం.
“ధరణి” లోని లోపాలు కబ్జా దారులపాలిట ఓ వరంగా మారిందని చెప్పడములో ఇలాంటి సందేహం లేదు.
కొందరు కాబ్జా రాయుళ్ళు సర్వేనెంబర్లు. 990 నుండి 1000 వరకు తప్పుడు పత్రాలను సృష్టించి రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. సదరు ప్రిన్సిపల్సెక్రటరీగ, జిల్లా కలెక్టర్ జిల్లా రెవిన్యూ అధికారి స్థానిక తహసీల్దారు విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని అలాంటి భారినుండి మా సొసైటీ ప్లాట్లను కాపాడాలని కోరారు .
పట్టా భూములును కుంచాల శ్రీనివాసరావు, జైస్వాలగర్వాల్, భూపాలరెడ్డి లాంటి కబ్జా రాయుళ్ళు అక్రమ లేఔట్లు వేసి అమ్ముకున్నారు ప్రభుత్వ భూములనుకూడా ప్రైవేట్ పట్టాలుగా తప్పుడు పత్రాలను సృష్టించి ఏదేచ్చగా కబ్జాలు చేసుతున్నారు. దాస్ యాదవ్ అనే వ్యక్తి వీటన్నింటికి మూలకారకుడు. షుమారు 500 మంది ప్లాటు యజమానులని నాశనం చేసినందుకు పరితోషంగా సర్వేయనెంబరు 1001 లో ఎకరా స్థలాన్ని తన పిల్లల పేరున రిజిస్టర్ చేసుకున్నాడు.
కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవిన్యూ మంత్రిగారికి, స్థానిక ఇంచార్జి మంత్రిగారికి, జిల్లా కలెక్టర్ గారికి 8500 మంది ప్లాటు ఓనర్లు అందరి బాధలను గమనించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇప్పుడు జరుగుచున్న అవినీతి బాగోతలపై సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలనీ సొసైటీ సభ్యుల విన్నపం.