ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ముంబయిలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు రాత్రికి ముంబయిలోనే బస చేశారు. ముంబయిలోని వర్ష భవన్ లో ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను కలిశారు. చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన షిండే… ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఇరువురి మధ్య సమావేశం జరిగింది. ఎన్డీయే కూటమి భాగస్వాములైన చంద్రబాబు, షిండే పలు అంశాలపై చర్చించుకున్నారు.